ఆ విషయంలో సౌత్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచిన అల్లు అర్జున్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన కు సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ గుర్తింపు ఉంది. దానితో ఈయన ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా చాలా తక్కువ కాలంలోనే ఈయనకు అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి ఆదరణ దక్కుతుంది.


ఇది ఇలా ఉంటే తాజాగా ఇన్ స్టా గ్రామ్ ప్లాట్ ఫామ్ లో అల్లు అర్జున్ 25 మిలియన్ ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏ సౌత్ నటుడి కి కూడా ఇన్ స్టా గ్రామ్ లో ఈ రేంజ్ ఫాలోవర్స్ లేరు. దానితో ఈయన ఈ విషయంలో ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను సాధించిన నెంబర్ వన్ సౌత్ హీరో గా నిలిచాడు. ఇకపోతే అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ... ఆఖరుగా పుష్ప పార్ట్1 మూవీ తో ప్రేక్షకులను పలకరించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని దక్కించుకున్నాడు.


ఈ మూవీ లోని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ఈ సినిమా లోని తన నటనకు గాను నేషనల్ అవార్డు ను కూడా దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఈయన పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: