హరిహర వీరమల్లు టీమ్ పై సెటైర్లు !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు దాటిపోతోంది. ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ కు కూడ ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందో క్లారిటీ లేదు. దీనితో ఈమూవీ గురించి పవన్ అభిమానులు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఈమూవీ తరువాత పవన్ నటించిన కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఈమూవీకి మోక్షం లేదు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల హడావిడి ముగిసిన తరువాత పవన్ పూర్తి చేయవలసిన సినిమాల లిస్టులో కూడ ఈమూవీ చివరి వరసలో ఉంది అని అంటారు. దీనితో ఈసినిమా ఎప్పటికైనా విడుదల అవుతుందా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే ‘అమేజాన్ ప్రైమ్’ నిర్వాహకులు ముంబాయిలో నిర్వహించిన కార్యక్రమంలో ‘హరిహర వీరమల్లు’ పోస్ట్ రిలీజ్ డిజిటల్ హక్కులు తమవే అంటూ ప్రకటించడం చాలామందికి షాక్ ఇచ్చింది.

ఈమూవీ థియేట్రికల్ రిలీజ్ తర్వాత ‘హరిహర వీరమల్లు’ ప్రైమ్‌లో రిలీజవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే దాని మీద సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పడుతున్నాయి. థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో తెలియని సినిమా డిజిటల్ హక్కులు కొని డిజిటల్ రిలీజ్ గురించి ప్రకటన ఇవ్వడం ఏమిటి అంటూ అమెజాన్ ప్రైమ్ పై నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఈ సినిమా విషయంలో జరుగుతున్న ఆలస్యం పవన్ అభిమానుల అసంతృప్తి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ విషయాలు తెలిసి ఉండి కూడ ఈ మూవీ రైట్స్ ను అమెజాన్ సంస్థ ఎలా తీసుకుంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

ఈ సినిమా ఫంక్షన్ కు హాజరైన క్రిష్ ఈసినిమాను ఎప్పుడెప్పుడు ప్రేక్షకులకు చూపించాల అని ఎదురు చూస్తున్నట్లు చెప్పడం మరింత షాకింగ్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత పవన్ అనుసరించే వ్యూహాలు ఎలా ఉంటాయో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఎన్నికల ఫలతాలు తరువాత పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో క్లారిటీ లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: