మహేష్ మూవీ సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈమూవీని జపాన్ భాషలోకి డబ్ చేసి ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈమూవీ విదేశాలకు సంబంధించిన డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్న ఈమూవీ జపాన్ బయ్యర్ ఆదేశంలో ఏర్పాటు చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ స్పెషల్ స్క్రీనింగ్ షోకు రాజామౌళి అతిధిగా ఆహ్వానించారు.

ఈ స్పెషల్ షోకు జపాన్ మీడియా ప్రతినిధులు అంతా రావడంతో ఈవిషయానికి సంబంధించిన వార్తలు అంతర్జాతీయ మీడియాలో చాల ప్రముఖంగా వచ్చాయి. ఈ సమావేశంలో అనేకమంది రాజమౌళిని మహేష్ తో తీయబోతున్న మూవీ ప్రాజెక్ట్ గురించి అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. మహేష్ తో తాను తీయబోతున్న సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఈ మూవీకి అనేకమంది విదేశీ సాంకేతిక నిపుణులు పని చేస్తున్న విషయాన్ని రాజమౌళి అధికారికంగా తెలియచేసినట్లు తెలుస్తోంది.

ఇక మహేష్ గురించి జపాన్ మీడియా గురించి మాట్లాడుతూ మహేష్ లాంటి అందమైన నటుడు దక్షిణ ఫిలిమ్ ఇండస్ట్రీలో మరొకరు లేరనీ తన పాత్ర విషయం గురించి ఎంత కష్టపడటానికైనా మహేష్ సిద్ధంగా ఉంటాడు అంటూ ఈమూవీ విడుదలలైన తరువాత మహేష్ ను వివిధ దేశాలకు తన మూవీ ప్రమోషన్ గురించి ఖచ్చితంగా తాను మహేష్ ను వెంటపెట్టుకుని వస్తాను అంటూ జక్కన్న ప్రకటించాడు. వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ లో ఈమూవీని విడుదలచేయాలని తన దృఢ సంకల్పం అని అంటున్నాడు.

అయితే ఈసినిమా కథ లాక్ అయింది కానీ ఈమూవీకి సంబంధించిన చర్చలు తనకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి ప్రతిరోజూ తన ఇంటిలో ఈమూవీ చర్చలు కొనసాగిస్తున్న విషయం తెలియచేశాడు. అయితే ఈమూవీకి సంబంధించిన హీరోయిన్ ఎంపిక విషయంలో తనకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు తెలియచేశాడు. ఇక ఈమూవీ పాటలు కీరవాణి చాల శ్రద్ధ పెట్టి మ్యూజిక్ కంపోజ్ చేశాడని రాజమౌళి కీరవాణి పై ప్రశంసలు కురిపించాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: