ఓటీటీ లో టాక్ షో చేసేందుకు సిద్ధమవుతున్న రానా...!!!
ఇండియన్ సినిమా నుంచి తన ఫ్రెండ్స్, సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయ నున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది.సిద్ధం గా వున్నారా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, 'ది రానా కనెక్షన్' టాక్ షో ఎప్పటి నుంచి స్ట్రీమ్ అవుతుందనేది మాత్రం అమెజాన్ ప్రైమ్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గతంలో రానా 'నంబర్ 1 యారీ' పేరుతో ఓ టాక్ షో కు హోస్ట్ గా చేశారు. ఇది ఆహా ఓటీటీలో ఎంతో పాపులర్ అయింది. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో ను నిర్వహించారు..అయితే, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం చేయనున్న ఈ 'ది రానా కనెక్షన్' టాక్ షో నేషనల్ వైడ్ గా ఉండనుందని తెలుస్తుంది.. టాలీవుడ్, బాలీవుడ్‍తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు కూడా ఈ టాక్ షో కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.