మహేష్ బాబు, బాలయ్య కాంబినేషన్లో మిస్ అయిన సినిమా..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ గా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తన వయసుకి తగ్గ పాత్రలను పోషిస్తూ సినీ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నాడు. ఇటీవల భగవంతు కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అనే తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఆ సినిమాలో 50 సంవత్సరాల కి పైబడిన వ్యక్తి పాత్రలో కనిపించి అందరిని అలరించాడు. ఇక ఆ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109 సినిమాతో మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

 అయితే ఈ సినిమాకి సంబంధించిన లిమ్స్ సైతం విడుదల అయింది. ఇక ఆ గ్లింమ్స్ వీడియో చూడడానికి చాలా బావుంది. చూడడానికి అద్భుతంగా ఉండడంతో పాటు ఈ సినిమాతో బాలయ్య మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. ఈసారి మరొక మాస సినిమాతో రాబోతున్నాడు అని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు బాలయ్య.  ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో చాలా మంచి పేరును సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

అయితే 2006 లో మహేష్ బాబు బాలయ్య బాబు కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా ఒక సినిమా రాబోతుంది అంటూ చాలా పెద్ద చర్చ అయితే నడిచింది.  ఈ సినిమాకి కోడి రామకృష్ణ డైరెక్షన్ చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. అయినప్పటికీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక దాంతో కోడి రామకృష్ణ అరుంధతి సినిమాని చేశాడు. ఇక ఆ తరువాత మహేష్ బాబు, బాలయ్య బాబు ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో కనక సినిమా వచ్చినట్టయితే అది సూపర్ డూపర్ హిట్ అయ్యుండేదని ఇప్పటికీ చాలామంది అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: