ఆ టాలీవుడ్ హీరో అంటే క్రష్.. షాకింగ్ విషయం చెప్పిన సమంత?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ప్రేక్షకులకు సమంత గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు దశాబ్దన్నర కాల నుంచి కూడా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తుంది సమంత. ఇక తన నటనతో తన అందం అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి. అయితే గతంలో సినిమాలతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇటీవల కాలంలో మాత్రం ఇక సినిమాయేతర అంశాలతో వార్తల్లో నిలుస్తుంది అని చెప్పాలి. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఏం మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోతుంది.

 మొన్నటికి మొన్న మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడే కోలుకుంది. ఇక ఇటీవల కాలంలో తన కెరియర్ పై మళ్లీ దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. అయితే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇక తన లైఫ్ లో జరిగిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది అని చెప్పాలి. సమంత చేసిన అన్ని కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తనకు ఒక టాలీవుడ్ హీరో పై క్రష్ ఉంది అంటూ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చింది. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కావడం గమనార్హం.

 అల్లు అర్జున్ అంటే తనకు క్రష్ అంటూ చెప్పుకొచ్చింది సమంత. నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంది. ఇక బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ అంటే చాలా గౌరవం. నేను నటిగా ప్రయాణం మొదలుపెట్టి 14 ఏళ్ళు అయింది. ఇక బిజీ కారణంగా  ఒక్కొక్కసారి కేవలం ఐదు గంటలు మాత్రమే పడుకునేదాన్ని.. నా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వలేదు. అయితే ఇక అనారోగ్యం కారణంగా నెంబర్ వన్ స్థానం క్షణాలను ఎంజాయ్ చేయలేకపోయాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: