పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో ఉస్తాద్ భగత్ సింగ్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో మొదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై చాల అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కాకుండా ఉండి ఉంటే ఈసమయానికి ఈ మూవీ షూటింగ్ కూడ పూర్తి అయి ఉండేది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి స్పందన రావడంతో పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం ఎన్నికల రణ క్షేత్రంలో క్షణం తీరిక లేకుండా ఉన్న పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తూ తన ‘జనసేన’ అభ్యర్థులను అదేవిధంగా తాను సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం బీజేపీ కూటమి కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిసి ఫలితాను వచ్చిన తరువాత అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే పవన్ ఆగష్టు నెల ప్రాంతం నుండి తిరిగి తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్ కు వచ్చే ఆస్కారం ఉంది.

అయితే ఎన్నికల రణ క్షేత్రంలో పోరాటం చేస్తున్న పవన్ కు బాసటగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఘాట్ అయిన కొన్ని సీన్స్ లోని పవర్ ఫుల్ డైలాగ్స్ ను ట్రైలర్ గా మార్చి ఈ మూవీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సహకారంగా ఈ ట్రైలర్ ను ఈ నెలాఖరు ప్రాంతంలో విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఈ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్స్ తూటాలు లా పేలడమే కాకుండా నేటి రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసే విధంగా హరీష్ శంకర్ చాల ఆలోచించి ఈ డైలాగ్స్ ను వ్రాయించాడని తెలుస్తోంది. స్వతహాగా హారీష్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడంతో ఈ డైలాగ్స్ విషయంలో అదేవిధంగా ఈ మూవీ ట్రైలర్ విషయంలో చాల శ్రద్ధపెట్టి ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: