నాకు ఆ జోనర్ సినిమాలు అసలు నచ్చవు... రాజమౌళి..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో ఎస్ ఎస్ రాజమౌళి ఒకరు. ఈయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "స్టూడెంట్ నెంబర్ 1" సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి గ్లోబల్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి అత్యంత బిజీగా సమయాన్ని గడుపుతున్నాడు. ఇకపోతే రాజమౌళి కుమారుడు కార్తికేయ తాజాగా మలయాళం లో సూపర్ హిట్ విజయం అందుకున్న "ప్రేమలు" అనే సినిమాని తెలుగు లో విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగులో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు.

అందులో రాజమౌళి మాట్లాడుతూ ... నాకు ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్న సినిమాలు నచ్చవు. ఎక్కువ శాతం నేను యాక్షన్ సినిమాలను ఇష్టపడుతుంటాను. కార్తికేయ "ప్రేమలు' సినిమాని తెలుగులో చేస్తాను అని చెప్పడంతో ఓకే అని చెప్పాను ... కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. సినిమా థియేటర్ లలోకి వచ్చాక కూడా ఆసక్తి లేకుండానే థియేటర్ కి వెళ్లాను. కానీ సినిమా చూస్తునంత సేపు టైమే తెలియలేదు. నవ్వుతూనే ఉన్నాను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: