ట్రెండింగ్ గా మారలేకపోయిన కన్నప్ప !

Seetha Sailaja
మంచు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రిలోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు  మొదటి సినిమా విడుదలై 20 సంవత్సరాలు దాటిపోయినా హీరోగా  ఇప్పటికీ పూర్తిగా సెటిల్ కాలేకపోయాడు అన్నకామెంట్స్ ఉన్నాయి.  ఎప్పటికప్పుడు సినిమాల జయాపజయాలతో సంబంధం  లేకుండా సినిమాలు ఈ మంచు వారి అబ్బాయి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  

ఇలాంటి పరిస్థితుల మధ్య విష్ణు కెరియర్ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ గా సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘కన్నప్ప’ మూవీ ఫస్ట్ లుక్ మహాశివరాత్రి రోజున విడుదలైంది. అయితే ఈ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ గా మారకుండా కేవలం మంచు కుటుంబ అభిమానులు లైక్స్ కొట్టే విధంగా కొనసాగడంతో మంచు విష్ణు ఈమూవీతో మరో పొరపాటు చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  

అయితే శివరాత్రి రోజున విడుడలైన ఈ ఫస్ట్ లుక్ ట్రెండింగ్ గా మారకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ ఫస్ట్ లుక్ తో పాటు ఈమూవీ మేకింగ్ కు సంబంధించిన చిన్న టీజర్ కూడ విడుదల చేస్తే బాగుండేదని కొందరి అభిప్రాయం. అదేవిధంగా ఈమూవీలో ప్రభాస్ మోహన్ లాల్ శరత్ కుమార్ మోహన్ బాబు లాంటి ప్రముఖ నటులు ఉన్నప్పటికీ వీరంతా  ఈమూవీలో ఏపాత్రలు చేస్తున్నారు అన్న విషయమై క్లారిటీ ఇస్తే బాగుండెదని మరికొందరి అభిప్రాయం.

మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈమూవీలో చేస్తున్న పాత్ర ల గురించి స్పష్టమైన క్లారిటీ లేకపోవడం ఈమూవీ విజయం పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే మంచు విష్ణు మరొక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీని కొనుక్కోవడానికి ఆలోచనలు చేస్తున్న కొందరు బయ్యర్లు ఇప్పుడు ఈమూవీ ఫస్ట్ లుక్ కు వచ్చిన స్పందన ట్రెండింగ్ గా మారకపోవడంతో కన్నప్ప విషయంలో మంచు విష్ణు పొరపాట్ల చేస్తున్నాడా అంటూ మరికొందరి అభిప్రాయం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: