ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసి విడాకుల వార్తలకు చెక్ పెట్టిన నయనతార..!!

murali krishna
గత కొన్ని రోజులుగా లేడీ సూపర్ స్టా్ర్ నయనతార, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ విడాకుల హల్చల్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమలో ఉన్న వీరు 2022లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.వీరికి ఇద్దరు కవలలు జన్మించారు. పెళ్లి తర్వాత కూడా వరుస లతో బిజీగా ఉన్న నయన్.. ఇటీవలే సొంతంగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల బిజినెస్ స్టార్ట్ చేసింది. నయన్, విఘ్నేశ్ ఇద్దరు తమ పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా నయన్ తన ఇన్ స్టాలో ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం నడుస్తుంది. 'ఆమె ఏడుస్తున్నప్పటికీ.. ఇది ఆమెకు లభించిందని అర్థం చేసుకుంది' అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ చేసింది నయన్. అదే సమయంలో తన భర్త విఘ్నేశ్ ను అన్ ఫాలో చేయడంతో వీరిద్దరి డివోర్స్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు ఒకేరకమైన పోస్టులు పెడుతూ విడాకుల వార్తలకు చెక్ పెట్టారు.
ఇక ఆ తర్వాత ఆమె కోల్పోయింది అంటూ మరో ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో అసలు నయన్ జీవితంలో ఏం జరుగుతుంది ?.. ఎందుకు ఇలాంటి ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తుంది ? తన భర్తతో విడిపోతుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తమ గురించి వస్తోన్న డివోర్స్ రూమర్స్ పై ఇప్పటివరకు ఇద్దరు స్పందించలేదు. కానీ ప్రస్తుతం వీరు తమ పిల్లలతో కలిసి దుబాయ్ వెకేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది నయన్. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరలవుతుండగా.. నయన్ తీరుపై మండిపడుతున్నారు నెటిజన్స్. ఇంత అన్యోన్యంగా ఉన్నప్పుడు అలాంటి ఎమోషనల్ కోట్స్ ఎందుకు పెడుతున్నావ్ ? అంటూ సీరియస్ అవుతున్నారు.నయన్, విఘ్నేశ్ ఫోటోలపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ.. అంత అందమైన జంట అని.. ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది జవాన్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నయన్.. ఆ తర్వాత తమిళంలో లేడీ ఓరియెంటెడ్ ల్లో నటిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది నయన్.. ఇక ఇప్పుడు తమ ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేసి విడాకుల వార్తలకు చెక్ పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: