తొలి సినిమాగా మంజుమ్మేల్ బాయ్స్ సూపర్ రికార్డ్?

Purushottham Vinay
మలయాళ సినిమా ఇండస్ట్రీ గురించి తెలిసిందే. అన్ని ఇండస్ట్రీల్లాగా స్టార్ హీరోల స్టార్ డం మీద డిపెండ్ అవ్వకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తూ ఎక్కువ హిట్లు కొడుతోంది. ఈ ఇండస్ట్రీలో మొదటి నుంచి కూడా మంచి కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలు వస్తూ ఉండేవి. ఈ సినిమాలకు అవార్డులు, విమర్శకుల ప్రశంసలు దక్కేవి కానీ కమర్షియల్‌ గా తెలుగు మరియు తమిళ సినిమాల స్థాయిలో వసూళ్లు నమోదు అయ్యేవి కాదు.కానీ ఇప్పుడు వసూళ్లలో మలయాళ సినిమాలు కుమ్మేస్తున్నాయి. కంటెంట్‌ ఓరియంటెడ్ సినిమాలకు కాస్త కమర్షియల్‌ టచ్ ఇస్తూ మలయాళ ఫిల్మ్‌ మేకర్స్ తీసుకు వస్తున్న సినిమాలకు ఇప్పుడు రికార్డు వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు వారికి పాతిక కోట్ల వసూళ్లు అంటే గొప్ప విషయం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2024 సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు కూడా పూర్తి అవ్వకుండా మూడు భారీ బ్లాక్ బస్టర్‌ కమర్షియల్‌ హిట్‌ సినిమాలు మలయాళం నుంచి వచ్చాయి.



ప్రేమలు, బ్రహ్మయుగం సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో మంచి వసూళ్లు నమోదు చేశాయి.. ఇంకా నమోదు చేస్తూనే ఉన్నాయి.రెండు వారాల క్రితం వచ్చిన మంజుమ్మేల్‌ బాయ్స్ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా రెండు వారాల్లో వంద కోట్ల వసూళ్లు అసలు నమోదు చేసిందే లేదు. అలాంటిది మంజుమ్మేల్‌ బాయ్స్‌ ఆ రికార్డ్‌ ను ఈజీగా దక్కించుకుంది. ఇంకా నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టిన ఏకైక మలయాళ సినిమాగా ఈ సినిమా నిలిచింది.ఇప్పటికే 140 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన ఈ సినిమా ముందు ముందు మరింత వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.మలయాళంలో పెద్ద పెద్ద స్టార్స్ కి సూపర్‌ స్టార్స్ కి దక్కని ఈ అరుదైన  రికార్డ్‌ ఈ  సినిమాకు దక్కడం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు లో మంజుమ్మేల్ బాయ్స్ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు నేటివిటీకి కాస్త దగ్గరగా ఉంటుంది కనుక కచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: