వైరల్ గా మారిన అజీత్ బ్రెయిన్ సర్జరీ షాకింగ్ న్యూస్...!!!

murali krishna
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అజిత్ కుమార్ అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అజిత్‌కు ఏమైందోనని ఫ్యాన్స్‌ కంగారు పడుతున్నారు. అజిత్ హాస్పిటల్‌లో జాయిన్ కావడానికి కారణం ఏంటో తెలియక తీవ్ర అందోళనకు గురవుతున్నాయి. అయితే అసలు విషయం ఇప్పుడు బయటకొచ్చింది. అపోలో హాస్పటల్ లో అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరిగిందని అంటున్నారు.తమిళ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. అయితే ఆయన తమిళంలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగినా కూడా చాలా సింపుల్ లైఫ్‌ను లీడ్ చేయడం ఆయన నైజాం. అలాగే హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు తనకెంతో ఇష్టమైన ఫోటోగ్రఫీ, ఏరో మోడలింగ్, బైక్ రేసింగ్ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నారు. ఆయా రంగాల్లో సత్తా చాటుతున్నారు.ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్న అజిత్ కుమార్‌.. రీసెంట్ గా రెగ్యులర్ హెల్త్ చెకప్‌ నిమిత్తం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. అయితే వైద్య పరీక్షల్లో అజిత్ మెదడులో స్వల్ప వాపు ఉన్నట్లు డాక్టర్లు గురించారు. చిన్నపాటి సర్జరీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.అపోలో ఆసుపత్రిలో డాక్టర్ పెరియగరుప్పన్ నేతృత్వంలో అజిత్ కు దాదాపు 4 గంటలు శ్రమపడి వైద్య బృందం శస్త్రచికిత్స చేశారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తమిళ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరిగినట్లు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ప్రస్తుతం అజిత్ విదా ముయార్చి అనే సినిమా చేస్తోన్నాడు. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: