లక్షల కోట్ల డబ్బు ఉన్న.. అనంత్ అంబానీ ఎందుకు బరువు తగ్గలేకపోతున్నాడో తెలుసా?

praveen
ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా అపర కుబేరుడిగా పిలుచుకునే ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల గురించే చర్చించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్లకు పెళ్లి  జరగాల్సి ఉండగా.. ఇక మార్చ్ 1వ తేదీ నుంచి మూడో తేదీ వరకు గుజరాత్ లోని జాంనగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక అతిరథ మహారదులు అందరూ కూడా ఇక్కడ దర్శనమిచ్చారు అని చెప్పాలి.

 అయితే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలలో అటు ఆనంత్ అంబానీ ప్రసంగం ప్రతి ఒక్కరి మనసును తాకింది. తాను చిన్నప్పటి నుంచి శారీరక రుగ్మతలతో పోరాడుతూనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులు ఎప్పుడు మద్దతుగా నిలిచారని.. అనంత్ అంబానీ ప్రసంగం ఇస్తుంటే.. ఈ మాటలు విన్న ముఖేష్ అంబానీ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే లక్షల్లో డబ్బులు సంపాదించే వారే ఏకంగా బరువు తగ్గి సన్నగా అవుతుంటే.. అపర కుబేరుడి కొడుకు అయినా ఆనంత్ అంబానీ ఎందుకు ఇలా ఊబకాయంతో ఉన్నాడు అన్న డౌట్ అందరిలో ఉండే ఉంటుంది. అయితే ఆస్తమా కారణంగా వచ్చే స్టెరాయిడ్ సమస్యతో అనంత్ అంబానీ ఊబకాయంతో బాధపడుతున్నాడట.

 అయితే గతంలో 208 కిలోల బరువు ఉండేవాడు అనంత్ అంబానీ. కానీ 2016లో ఆయన ఒక్కసారిగా బరువు తగ్గి కనిపించడంతో అందరూ షాక్ అయ్యారూ. ఏకంగా 18 నెలల్లోనే 108 కిలోలు తగ్గారు ఆయన. అయితే అనంత్ అంబానీ తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతుండడంతో తీవ్రమైన స్టెరాయిడ్స్  తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఇక అనంత్ తల్లీ నీతా అంబానీ చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఒక్కసారిగా బరువు తగ్గిన అనంత్  2020లో కాబోయే భార్య రాధిక మర్చంట్ పుట్టినరోజు వేడుకల సమయంలో మరోసారి బరువు పెరగడం కనిపించింది. ఇక 2022 డిసెంబర్ లో సోదరీ ఈషా అంబానీ కవలల ఫంక్షన్ లో నుండి బయటికి వచ్చిన వీడియోలో అనంత్ మళ్ళీ బరువు పెరిగి కనిపించాడు. ఇక ఇప్పుడు ప్రీ వేడుకలలో కూడా మళ్ళీ ఊబకాయంతోనే ఉన్నాడు అనంత్ అంబానీ. దీంతో ఎంతోమంది అతని శరీర బరువును ఎగతాలు చేస్తున్నారు. కానీ కొంతమంది మళ్ళీ అతను పట్టుదలతో బరువు తగ్గగలడు అంటూ మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: