ఎన్టీఆర్ ఖాతాలో మరో బాలీవుడ్ మూవీ?

Purushottham Vinay
'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా 1350 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. తన కొత్త సినిమా 'దేవర' కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండగా మళ్ళీ ఎన్టీఆర్ నేరుగా హిందీ మూవీ చేయబోతున్నాడు. అదే.. వార్-2. బాలీవుడ్లో స్పై చిత్రాలకు పెట్టింది పేరైన యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఆల్రెడీ హిందీలో బ్లాక్ బస్టర్ అయిన 'వార్' సినిమాకు ఇది సీక్వెల్. 'వార్' సినిమాను సిద్దార్థ్ ఆనంద్ రూపొందిస్తే.. 'వార్-2' సినిమాను 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలోనే ఎన్టీఆర్ ఈ సినిమా చిత్రీకరణకు హాజరవుతాడని వార్తలు వస్తున్నాయి.ఇప్పుడు తారక్ చేయబోయే మరో బాలీవుడ్ మూవీ గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.



'వార్-2' సినిమా పూర్తయిన తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్‌లోనే ఇంకో బాలీవుడ్ మూవీ చేసేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. ఇది అతను సోలో హీరోగా నటించే పాన్ ఇండియా సినిమా అని అంటున్నారు. 'వార్-2' సినిమాతో వచ్చే గుర్తింపు తర్వాత ఎన్టీఆర్ సోలోగా హిందీ సినిమా చేసినా బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది. మరి ఈ సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.ఇక 'వార్-2' సినిమా విషయానికి వస్తే.. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలైంది. హృతిక్ రోషన్ మీద కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్వరలోనే 'దేవర' షూట్ పూర్తి చేసి ఏప్రిల్ నెలాఖర్లో 'వార్-2' సెట్లో అడుగు పెడతాడని అంటున్నారు. 'వార్' మూవీలో హృతిక్‌కు తోడుగా టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్ చేశాడు. ఇక అతడి పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. మరి ఎన్టీఆర్ కూడా అలాంటి పాత్రే చేస్తాడేమో చూడాలి. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుందో ఆల్రెడీ మనం 'జై లవకుశ'లో చూసాం. మరి ఈ మూవీలో ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: