బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి .. వరలక్ష్మి శరత్ కుమార్..!!

Divya
సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తె హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఎట్టకేలకు అభిమానులకు తాజాగా ఒక శుభవార్తను సైతం తెలియజేసింది.. చాలా కాలం నుంచి సింగిల్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.. అంతేకాకుండా ఈ రోజున తన ఎంగేజ్మెంట్కు సంబంధించి కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది.. వరలక్ష్మి శరత్ కుమార్ మొదట తమిళ సినిమాలలో నటించింది. ప్రస్తుతం తెలుగు కన్నడ వంటి భాషలలో కూడా నటిస్తూ స్టార్ యాక్టర్ గా పేరు సంపాదిస్తోంది.


ప్రస్తుతం ఇమే ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాం స్వచ్ఛదేవ్ తో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిశ్చితార్థం ఈరోజుది కాదు నిన్ననే జరిగినట్టుగా తెలుస్తోంది. కేవలం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగిందని సమాచారం.. వరలక్ష్మి కాబోయే భర్త ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారట.వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు తల్లితండ్రులు అంగీకారంతోనే నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం..


వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందో అనే విషయం పైన ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కుటుంబ సభ్యులు.. త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వేడుకకు సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది. వాస్తవానికి వరలక్ష్మి శరత్ కుమార్ గతంలో హీరో విశాల్ తో ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి అటు విశాల్ తో పాటు వరలక్ష్మి సైతం ఎన్నో సార్లు తామిద్దరం మంచి స్నేహితులము అంటూ వెల్లడించారు అయినా సరే వీరిద్దరి గురించి రూమర్స్ మాత్రం ఆగలేదు ఇక తెలుగులో ఇమే చేసిన సినిమాల విషయానికి వస్తే.. హనుమాన్, వీర సింహారెడ్డి, క్రాక్, తదితర చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: