చారి 111 మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Anilkumar
ఇప్పటివరకు చాలామంది కమెడియన్స్ హీరోలుగా నటించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు సక్సెస్ అయితే కొందరు మాత్రం ఉన్న అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు. వెన్నెల కిషోర్ కూడా చారి111 తో హీరోగా మన ముందుకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళకి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
సినిమాలో కమెడియన్ గా నవ్వించడం వేరు హీరోగా సినిమా మొత్తం భుజాల మీద మోయటం వేరు. మరి వెన్నెల కిషోర్ చారి 111 తో సినిమా మొత్తం  తన భుజాలపై మోసి హిట్ అందుకుంటాడా అంటే అనుమానమే. రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంట్ టీం ని మేజర్ ప్రసాదరావు( మురళీ శర్మ ) నడిపిస్తుంటాడు. దేశభద్రత కోసం ఈ టీం  సీక్రెట్ గా పనిచేస్తుంది. ఈ టీం కి సీఎం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. హైదరాబాదులో ఒకసారి సూసైడ్ బాంబ్ అటాక్ జరుగు తుంది కానీ ఆ వ్యక్తి దగ్గర ఎలాంటి పేలుడు పదార్థాలు కాని బాంబు గాని దొరకదు.
ఆ విషయాన్ని పరిశోధించేందుకు రుద్రనేత్ర టీం రంగంలోకి దిగుతుంది. అందులో ఏజెంట్ చారి 111( వెన్నెల కిషోర్ ) ఈ మిషన్ ని అప్పగిస్తారు. ఈ కేసుని చారి ఎలా సాల్వ్ చేశాడు అన్నది సినిమా కధ. వెన్నెల కిషోర్ ని జేమ్స్ బాండ్ లెవెల్ లో ఎవరూ ఊహించుకోరు. అతని నుంచి అందరూ కామెడీ ఎక్స్పర్ట్ చేస్తారు. ఇతర సినిమాలలో కామెడీ చేసే వెన్నెల కిషోర్ ఈ సినిమాలో చేసింది కామెడీయేనా అనిపిస్తుంది ప్రేక్షకులకి.
లాజిక్కులు పక్కన పెట్టేసి నవ్వుకుందామా అంటే ఒక్క సీను కూడా నవ్వు రాదు. ఫస్ట్ హాఫ్ ని భరించడం కష్టం  అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంటుంది. విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరో జీరో అయిపోవడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తానికి ఈ సినిమా కామెడీని బాగా పండించింది.
రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: