వామ్మో: మరో హర్రర్ మూవీ భూతద్దం భాస్కరనారాయణ.. ట్రైలర్ రిలీజ్..!!

Divya
ఇండస్ట్రీలో ప్రతిసారి ఏదో ఒక ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది.. గత కొద్దిరోజులుగా ఎక్కువగా బయోపిక్ ట్రెండ్ నడిచినప్పటికీ మరికొన్ని రోజులు బ్రేకప్ స్టోరీలో కూడా నడిచాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా హర్రర్ కాన్సెప్ట్ తో నడిచేటువంటి సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా దెయ్యాలు, భూతాలు, చేతబడులు, క్షుద్ర పూజలు ఇతరత్రా కధలతో వచ్చిన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. తాజాగా ఇలాంటి కథతోనే ఇప్పుడు యంగ్ హీరో శివ కందుకూరి.. డైరెక్టర్ రాజ్ దర్శకత్వంలో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాని తెరకెక్కించారు.

ఇందులో రాసి సింగ్ హీరోయిన్గా నటించగా అరుణ్ కుమార్, దేవి శ్రీప్రసాద్, వర్షిణి, శివకుమార్, కల్పలత ఇతరతులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.. క్రైమ్ ట్రేలర్గా వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషన్స్ కంటెంట్కు కూడా భారీగానే రెస్పాన్స్ లభిస్తుంది ఈమధ్య థ్రిల్లింగ్ ఎలివేషన్స్ తో కూడిన టీజర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ట్రైలర్ కూడా విడుదల కావడంతో మరింత హైప్ పెంచేసింది.. విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే సైకో కిల్లర్ హత్యలను చేదించడానికి డిటెక్టివ్గా ఇందులో భాస్కర్ మారతారు అయితే పోలీసులు ఆ సైకో కిల్లర్ ఎవరు భాస్కర్ అన్ననే ఆధారాలతో సహా చూపిస్తూ ఉంటారు..ఇక తన అన్నను కాపాడుకోవడానికి అసలైన సైకో కిల్లర్ని పట్టుకోవడానికి భాస్కర్ ఇలాంటి ప్రయత్నాలు చేశారు అన్నదే ఈ సినిమా కదా అన్నట్టుగా తెలుస్తోంది.. ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు అమ్మాయిలను మాత్రమే చంపుతున్నారని వారి తలలు నరికి క్షుద్ర పూజలు చేయడం వెనుక అసలు కథ ఏంటనేది మార్చి 1న తెలుస్తుంది.. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండడంతో ఈ సినిమా ఖచ్చితంగా హారర్ సినిమా అని అందరిని భయపెడుతుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: