ఐకాన్ స్టార్ ‘పుష్ప-2 ది రూల్’ లో అల్లు అయాన్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2 ది రూల్’ చిత్రంపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘పుష్ప-1 ది రైజ్’ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. అల్లు అర్జున్‍ను పాన్ ఇండియా స్టార్‌ను చేసింది. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగానూ అవార్డు దక్కించుకొని చరిత్ర సృష్టించారు అల్లు అర్జున్‍.  పుష్ప -2’ను పుష్ప-1 ను మించి తెరకెక్కించేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట.. ఇక ఐకాన్‌ స్టార్ కూడా దీని గురించి పెద్ద టార్గెట్టే పెట్టుకున్నాడట..

‘పుష్ప2’తో బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారట.. ఈ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనేదే బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నాడట. దీనికోసం పుష్ప-2 మూవీని డబుల్ ఎనర్జిటిక్‌గా తెరకెక్కిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముక్యంగా యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయేలా ఉండనున్నాయని తెలుస్తోంది. దీందో రోజు రోజుకు 'పుష్ప 2' పై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. 'పుష్ప 2'లో

 అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఓ కీ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. దీంతో ఐకాన్ ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. పుష్ప 2లో ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు.ఇక ఓ భారీ సంస్థ నుంచి పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం (అన్ని భాషల రైట్స్‌తో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా) 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: