సినిమా ఇండస్ట్రీలో అందానికి మరియు నటనకి సావిత్రి అనంతరం పెట్టిన పేరు సౌందర్య. ఈమె అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో ఇలా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. కానీ ఒక హీరోతో మాత్రం జత కట్టలేదు. ఆ హీరోనే మహేష్ బాబు. తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ మంచి ఫేమస్ అయ్యాడు.ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నాడు. ఇక సౌందర్య.. మహేష్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ నటించిన యువరాజు మూవీ లో హీరోయిన్ క్యారెక్టర్ కోసం సౌందర్య ని అప్రోచ్ అయ్యారు చిత్ర బృందం. అప్పుడు సౌందర్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందట.అనంతరం ఇద్దరినీ పెట్టి ఫోటోషూట్ చేస్తే.. మహేష్ చాలా సన్నగా క్లీన్ షేవ్ తో ఉండడంతో ఏ యాంగిల్ లో చూసిన మహేష్ బాబు సౌందర్య కి తమ్ముడు లాగానే కనిపించాడట. ఇక దాంతో సౌందర్య నేను మహేష్ కి అక్క లాగా కనిపిస్తున్న సో ఈ మూవీకి నేను సెట్ అవ్వను. ఈ సినిమాకి సిమ్రాన్ అయితే బాగా సెట్ అవుతుంది అని మూవీ టీం కి అపాయింట్ చేసిందట సౌందర్య.ఇక ఈ కారణం చేత వీరిద్దరి కాంబినేషన్లో ఏ సినిమా కూడా రాలేదు. అప్పటి కాలంలో సినిమా అవకాశం దక్కితేనే గొప్ప అనుకునే వారు హీరోయిన్స్. ఇక తమకి దక్కిన అవకాశాన్ని ఏమాత్రం చెయ్యి జార్చుకునేవారు కాదు. ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా తమకి రెమ్యూనరేషన్ వస్తుంది కదా అని ఆలోచించుకునేవారు. ఇక అటువంటి సిచువేషన్ లో కూడా తనకి ఆ పాత్ర సెట్ కాదని సిమ్రాన్ ని ఎంపిక చేసిన సౌందర్య నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.