పెళ్లి బాజా మ్రోగించనున్న బిగ్ బాస్ హౌస్ మెట్స్..??
ఇక అనంతరం స్లో స్లోగా యావర్ తో ట్రాక్ మొదలుపెట్టింది. ఇక యావర్ తో కొన్ని మనస్పార్ధాలు రావడంతో ప్రశాంత్ వైపుకు మళ్ళింది. ఇక మజ్జిట్లో బయటకి వెళ్లి వచ్చిన రతిక వచ్చినా అనంతరం మళ్లీ యావర్ తో లవ్ ఎఫైర్ ని కంటిన్యూ చేసింది. తను హౌస్ లో ఉండేందుకు ఒక సాకును నేతుక్కుంటూ కొన్నాళ్లు కొనసాగినప్పటికీ తన ప్రవర్తన ప్రేక్షకులకి నచ్చక మరోసారి బయటకు పంపించేశారు. ఇక ఈ గోల ఇక్కడితో పోయింది అనుకునే లోపే కొన్ని షూస్ కి పాల్గొంటూ మళ్లీ కలిసి పోయారు ప్రశాంత్ మరియు రతిక.బిబి ఉత్సవంలో వీరిద్దరూ సందడి చేశారు. ఇక వీరిద్దరి మధ్యలో నేనెందుకు అనుకున్న యావర్.. నయని పావనితో ఎఫైర్ మొదలుపెట్టాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ మరియు రతిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.