త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్న రైతుబిడ్డ, రతిక..!?

Anilkumar
బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకుంది కేవలం రతిక మాత్రమే. ఎంతలా అంటే ఆమె ఎలిమినేట్ కావాలని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. బిగ్‏బాస్ గేమ్ వరకే కాకుండా ఆమెను పర్సనల్ అటాక్ చేస్తూ నెట్టింట దారుణంగా ట్రోలింగ్ చేశారంటే రతికపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉండేదో చెప్పక్కర్లేదు. మొత్తానికి నాలుగో వారం ఈ బ్యూటీని ఎలిమినేట్ అయ్యేలా చేశారు అడియన్స్. టైటిల్ ఫేవరేట్ అంటూ బిగ్‏బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది రతిక. మొదటి వారం క్యూట్ లుక్స్‏తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. 

ఇక అదే వారం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‏తో క్లోజ్ గా ఉండడం.. అతడిని ప్రేమ పిచ్చోడిని చేసేసింది. ఇక రెండో వారంలోనే అతడిని నామినేట్ చేస్తూ షాకిచ్చింది. రతిక దెబ్బకు రైతు బిడ్డ నోరెళ్లబెట్టేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ తో ఉంటూనే టైమ్ వచ్చినప్పుడల్లా అతడిని మాటల దాడి చేసింది బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకున్న రతిక  . ముఖ్యంగా ప్రశాంత్ ను టార్గెట్ చేయడం.. ఆ తర్వాత వెంటనే యావర్ తో పులిహోర కలపడం.. తిరిగి అతడికే వెన్నుపోటు పొడవడం రతికకు మైనస్ అయ్యాయి. అంతేకాకుండా

అనవసర విషయాల్లో తలదూర్చి రాద్ధంతం చేయడం.. ప్రతి చిన్నదానిని సాగదీస్తూ ఇంటి సభ్యులకు తలనొప్పిగా మారింది. . ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ మరియు బిగ్‏బాస్ సీజన్ 7లో అందరి కంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకున్న రతిక  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ పెళ్లి చేసుకునేందుకు మక్కువ చూపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: