కథ వినలేదు, రూపాయి తీసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా సినిమా చేసిన షారుక్?

praveen
సాధారణం గా స్టార్ హీరోలు తమ సినిమా కథల విషయం లో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా కథ నచ్చితేనే ఓకే చేస్తూ ఉంటారు. లేదంటే నిర్మొహమాటం గా నో చెప్పేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కథ నచ్చినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడం తో సినిమాలను వదులుకోవడానికి రెడీ అవుతూ ఉంటారు హీరోలు. కానీ ఏకంగా కథ వినకుండానే స్టార్ హీరోలు సినిమాలు చేస్తారు అంటే నమ్ముతారా.. కథ వినకుండా ఎందుకు చేస్తారు అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం కథ వినకుండానే సినిమా చేశాడు. అది కూడా ఎలాంటి పారితోషకం తీసుకోకుండా ఫ్రీగా నటించాడు.

 ప్రొఫెషన్ వేరు స్నేహ బంధం వేరు అని అనుకుంటున్నా నేటి రోజుల్లో ఇక బాలీవుడ్ బాద్ షారుక్ ఖాన్ మాత్రం ఏకంగా స్నేహ బంధానికి ఎంతో విలువని ఇచ్చాడు. ఏకంగా స్క్రిప్ట్ వినకుండానే.. డబ్బులు తీసుకోకుండానే సినిమా చేసేసాడు. ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు నిర్మాత వివేక్ వాస్వామి. ఈయన 2010లో దుల్హ మిల్ గయా అనే సినిమా నిర్మించాడు. ఇందులో ఫర్జిన్ ఖాన్, సుస్మితాసేన్ ప్రధాన పాత్ర లో నటించారు. షారుక్ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు  వివేక్ సినిమా కోసం నా దగ్గరికి రావడం ఇదే మొదటి సారి. ఇందులో ఆలోచించాల్సింది ఏముంది. సినిమా చేస్తున్నాను కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు అంటూ షారుక్ అన్నాడు. కనీసం స్క్రిప్ట్ కూడా వినలేదు. అలా అని కేవలం అతిథి పాత్రలో నటించలేదు. సినిమాలో 42 నిమిషాలు కనిపిస్తాడు   అందులో ఒక్క సన్నివేశం కూడా ఎడిట్ చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఇక ఐదు రోజుల్లో షారుఖ్ ఖాన్ సీన్స్ ని పూర్తి చేశాం అంటూ వివేక్వా స్వామి చెప్పుకొచ్చాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: