అలాంటి కధ విని ఏడ్చేసిన బాహుబలి బ్యూటీ అనుష్క....!!
ఈ సినిమాలో వేశ్య పాత్ర కోసం దర్శకుడు ఎవరైనా మామూలు అమ్మాయి దొరకపోతుందా అని అనుకుంటున్నా సమయంలో అల్లు అర్జున్ మాత్రం అనుష్క అయితే చాలా చక్కగా ఉంటుంది అని సజెస్ట్ చేశారట. కానీ అలాంటి ఒక వేశ్య పాత్ర ఆమె చేస్తుందా అనే సందేహం దర్శకుడు వ్యక్తం చేయడంతో ముందు మీరు కథ చెప్పండి ఆ తర్వాత జరిగేది ఎలాగో జరుగుతుంది కదా అని అన్నారట. దాంతో ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అనుష్కకి కథ చెప్పడానికి వెళ్లారట.
అక్కడికి వెళ్ళగానే ఆమెను చూసి మొదట ఇదొక వేశ్య పాత్ర అని చెప్పగానే ఆమె ఏమనుకుంటుందో అని సందేహంతో చూస్తున్న క్రమంలో పర్వాలేదు కదా చెప్పండి అంటూ ఆమె ఓకే అనడంతో మిగతా కథను పూర్తి చేశాడట క్రిష్ కథ మొత్తం విన్న తర్వాత అప్పటికే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న అనుష్క కన్నీళ్లు పెట్టుకుందట. ఇలాంటి ఒక పాత్ర మళ్ళీ రాదు ఖచ్చితంగా ఈ పాత్రను నేనే చేస్తాను అని చెప్పారట. అలాగే ఒక వేశ్య పాత్ర చేసినప్పటికీ ఎక్కడ నెగటివ్ ఇంపాక్ట్ అనేది చూపించకుండా అందరి దృష్టిని ఆకర్షించింది అనుష్క. ఈ సినిమా హిట్ అవ్వడానికి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డారో అదే రేంజ్ లో అనుష్క క్రేజ్ మరియు నటన కూడా ఈ సినిమాకి ఉపయోగపడింది. వేశ్య అంటే ఇలాగే ఉంటుందా అని అనిపించేలా ఆమె ఈ పాత్రలో ఒదిగిపోయింది.