తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు ను సంపా దించుకున్న నటుల లో చిరంజీవి ఒకరు. ఈయనను మించిన నటుడు ఇండియాలోనే లేడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు.ఎందుకంటే ఆయన చేసిన పాత్రలే ఆయన్ని అందరికంటే ఉన్నతమైన స్థాయి లో నిలిపాయని చెప్పాలి. అప్పట్లో ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా ఇండస్ట్రీ లో ఒక చిరస్మరణీయం గా నిలిచి పోయిందనే చెప్పాలి.చిరంజీవి అంటే ఇండియా లో ఉన్న ప్రతి ఒక్కరికి అమితమైన గౌరవంతో పాటు ఇష్టం కూడా ఉంటుంది. అయితే చిరంజీవి చేసిన స్నేహం కోసం సినిమా లో విజయ్ కుమార్ పోషించిన పాత్ర లో అప్పటి మేటి నటుడు అయిన ఆర్ నారాయణ మూర్తి ని తీసుకోవాలని సినిమా యూనిట్ భావించారు. కానీ నారాయణ మూర్తి ఆ పాత్ర ని చేయడానికి పెద్ద గా ఇష్ట పడలేదు. ఆయన అప్పుడు కమ్యూనిస్టు భావాల తో ఉన్న సినిమాలను ఎక్కువ గా చేస్తూ వచ్చాడు. కాబట్టి అలాంటి ఒక సింపుల్ రోల్ లో నటించడానికి తను ఇష్టపడలేదు. చిరంజీవికి ఫ్రెండ్ గా నారాయణ మూర్తి చాలా బాగా సెట్ అయ్యేవాడు.అలాగే ఆ సినిమాలో ఆయన చేస్తే ఇంకా భారీ రెస్పాన్స్ కూడా వచ్చి ఉండేదని ఆ సినిమా డైరెక్టర్ అయిన కేఎస్ రవికుమార్భా వించాడు. కానీ చిరంజీవి అడిగిన కూడా ఆర్ నారాయణ మూర్తి ఆ పాత్ర ను రిజెక్ట్ చేశాడు... ఇక మొత్తానికైతే స్నేహం కోసం సినిమా యావరేజ్ గా ఆడింది. ఒకవేళ నారాయణమూర్తి కనక ఈ సినిమాను చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అంటూ ఇప్పటికీ చిరంజీవి అభిమానులు ఈ సినిమా ప్రస్థావన వచ్చిన ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే నారాయణ మూర్తి తన సినిమాల్లో తప్ప వేరే వాళ్ల సినిమాల్లో నటించను అని ఇప్పటికీ అదే సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నాడు.