సంతోషంలో హీరో నిఖిల్ కుటుంబసభ్యులు....!!

murali krishna
టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ గుడ్‍న్యూస్ చెప్పారు. ఆయన తండ్రి అయ్యారు. నిఖిల్ భార్య డాక్టర్ పల్లవి.. మగబిడ్డకు జన్మనిచ్చారు.హైదరాబాద్‍ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నేడు ఫిబ్రవరి 21 వారికి కుమారుడు జన్మించారు. దీంతో నిఖిల్, పల్లవి తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా వెల్లడించారు. ఓ ఫొటోను కూడా షేర్ చేశారు.తన కుమారుడిని చేతుల్లోకి తీసుకొని నుదుటిపై నిఖిల్ ప్రేమగా ముద్దు పెడుతున్న ఫొటో బయటికి వచ్చింది. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ నిఖిల్‍, పల్లవి దంపతులకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. 2020లో నిఖిల్, పల్లవి వివాహం జరిగింది. ఇప్పుడు (ఫిబ్రవరి 21, 2024) వారు తల్లిదండ్రులయ్యారు.నిఖిల్, పల్లవి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో కంగ్రాచులేషన్స్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.పల్లవి సీమంతం వేడుక గత నెలా ఖర్లో ఘనంగా జరిగింది. నిఖిల్ ఇంట్లో సంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తమ ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో నిఖిల్ గతంలో ఓ సందర్భంలో చెప్పారు. ఓ పార్టీలో తాను పల్లవిని చూశానని, తొలి చూపులోనే ప్రేమలో పడ్డానని తెలిపారు. ఆ తర్వాత ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పల్లవి నంబర్ తీసుకొని కాల్ చేశానని చెప్పారు. అనంతరం తాను, పల్లవి ఒకరినొకరం అర్థం చేసుకున్నామని తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు పెద్దలను ఒప్పించామని వివరించారు. కరోనా సమయం లో హైదరాబాద్‍ లోని ఫామ్‍హౌస్‍లో 2020 మే 14వ తేదీన నిఖిల్, పల్లవి వివాహం జరిగింది.ప్రస్తుతం పాన్‌ఇండియా మూవీ 'స్వయంభూ' లో నిఖిల్‌ నటిస్తున్నాడు. దీంతో పాటు 'ది ఇండియా హౌస్', 'కార్తికేయ 3' చిత్రాలు కూడా చేతిలో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: