ఓటీటీ లో అప్పుడే రజనీకాంత్ మూవీ...!!!

murali krishna
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజినీ కాంత్ కీలక పాత్ర పోషించిన 'లాల్ సలామ్' సినిమా ఊహించని రీతిలో డిజాస్టర్ అయింది. జైలర్ లాంటి బ్లాక్‍బాస్టర్ తర్వాత రజినీ నటించిన సినిమా ఈ రేంజ్‍లో ఫ్లాఫ్ కావడం ఆశ్చర్యపరిచింది.ఫిబ్రవరి 9న రిలీజైన లాల్ సలామ్ తమిళంలోనూ ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగులోనూ అదే పరిస్థితి. దీంతో లాల్ సలామ్ మూవీ అంచనాల కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తోంది.లాల్ సలామ్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ప్లాట్‍ఫామ్ నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. మార్చి తొలి వారంలోనే ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అయింది. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రజినీకాంత్ కీలకపాత్ర చేశారు. అయితే, ఈ సినిమా మార్చి మొదటి వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తే.. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్‍కు వచ్చినట్టవుతోంది. ఒకవేళ తొలి వారం నుంచి ఆలస్యమైతే.. మార్చి రెండో వారం కచ్చితంగా ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని టాక్ ఉంది.రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. లాల్ సలామ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ మెగాఫోన్ పట్టారు. క్రికెట్‍తో పాటు మతాల అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్‍గా రజినీ నటించారు. మతసామరస్యం సందేశాన్ని ఇచ్చేందుకు స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్.లాల్ సలామ్ చిత్రంలో విఘ్నేష్, లివింస్టన్ సెంథిల్, జీవిత రాజశేఖర్, తంబి రామయ్య, వివేక్ ప్రసన్న కీరోల్స్ చేశారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.లాల్ సలామ్ చిత్రం సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో రూపొందించారు. రిలీజ్‍కు ముందు వరకు మోస్తరు బజ్ ఉండేది. అయితే, ఈ చిత్రానికి తొలి షో నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. ఔట్‍ డేటెడ్ మూవీ అనే కామెంట్లు వచ్చాయి. దీంతో ఓపెనింగ్ కూడా పేలవంగానే వచ్చింది. ఈ మూవీకి మొత్తంగా కేవలం రూ.25 కోట్లలోపే వసూళ్లు వచ్చాయని అంచనా. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. లాల్ సలామ్ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు.కుసుమారు అనే గ్రామంలో లాల్ సలామ్ కథ నడుస్తుంది. ఆ ఊరి నుంచి ముంబైకి వెళ్లి బడా పారిశ్రామిక వేత్త అవుతారు మొయిద్దీన్ భాయ్ (రజీనికాంత్). అయితే, ఓ క్రికెట్ మ్యాచ్ సమయంలో షంషుద్దీన్ (విక్రాంత్) చేతిని గురు (విష్ణు విశాల్) నరికేస్తాడు. మొయిద్దీన్ కొడుకే షంషుద్దీన్. క్రికెట్‍లో జరిగిన ఈ గొడవ వల్ల మత కలహాలు చెలరేగుతాయి. ఆ తర్వాత ఈ విషయంలో మొయిద్దీన్ భాయ్ కలగజేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? గొడవలు సద్దుమణిగాయా? అనేదే ఈ సినిమాలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: