తలపతి విజయ్ పార్టీ పేరులో మార్పులు

Anilkumar
కోలీవుడ్ స్టార్ హీరోల దళపతి విజయ్ ఇటీవలే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ఫిబ్రవరి 2న 'తమిళగ వెట్రి కళగం' (TVK) అనే పేరుతో సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు విజయ్. ఆల్రెడీ కమిటైన రెండు సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా ప్రజా సేవకే అంకితం కాబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు వచ్చే తమిళనాడు లోక్‌ సభ ఎన్నికల్లో సైతం విజయ్‌ పోటీ చేయనున్నారు. ఇలాంటి తరుణంలో దళపతి విజయ్  కొత్త పార్టీ 'తమిళగ వెట్రి కళగం' గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.


దాని ప్రకారం విజయ్ కొత్త పార్టీ పేరులో కొంత మార్పులు చేయాలని నిర్ణయించినట్లు లేటెస్ట్ కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' అనే పార్టీ పేరులో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. ఈ పార్టీ పేరులో అదనంగా 'క్' అనే అక్షరాన్ని జోడిస్తున్నారట. అందుకు కారణం, ఈ పార్టీ పేరుకు కొంత వ్యతిరేకత వస్తుండడమే అని అంటున్నారు. 'తమిళగ వెట్రి కళగం' పార్టీని ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దీనిపై తమిళనాడు కొన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వస్తోందట దానికి తోడు తమిళనాడులో 'తమిళగ వాల్వురిమై కట్చి' 


అనే పేరుతో ఓ పార్టీ ఉంది. ఆ పార్టీని కూడా ఇంగ్లీషులో 'టీవీకే' అని పిలుస్తున్నారు. దళపతి విజయ్ పార్టీని కూడా ఇదే పేరుతో పిలుస్తుండడంతో తమ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారట. దీంతో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పేరులో 'క్' అనే అక్షరాన్ని జోడించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రకారం ఇకనుంచి తలపతి విజయ్ పార్టీని 'తమిళగ వెట్రిక్ కళగం' అని పిలవాలని పార్టీ వర్గాలు నిర్ణయించాయి.తమిళంలో 'వడ చెన్నై', 'అసురన్', 'విడుదలై' వంటి సినిమాలతో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రి మారన్ ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: