ప్రముఖ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కానున్న మోహన్ లాల్ మూవీ....!!
మలయాళం స్టార్ మోహన్ లాల్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ఆయన సినిమాలను ఇక్కడి ప్రేక్షకులకు కూడా ఆ దరిస్తుంటారు. కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తుంటారు కూడాను.తాజా గా ఆయన నుంచి ఓ కొత్త సినిమా వచ్చిం ది. చివ రిగా రజినీకాంత్ 'జైలర్' లో గెస్ట్ రోల్ లో అల రించిన విషయం తెలిసిందే. ఇక తాజా గా మలై కొట్టై వాలిబన్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ చిత్రం గత నెల 25 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ పెద్దగా ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. రూ.70 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం కనీసం అందులో సగం బడ్జెట్ ను కూడా తిరిగి రాట్టలేకపోయింది.కానీ ఈ చిత్రం లో మోహన్ లాల్ పోరాట యోధుడి గా అలరించారు. ఆయన నటన ఆక ట్టుకుంది. ఇండి పెండెన్స్ కు ముందు కు బ్రిటీషర్ల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. మల్ల యోధుడిగా మోహన్ లాల్ అలరించారు.అయితే ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందు కు రెడీ అయ్యిం ది. ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఇంకా ఐదు రోజుల్లో అందుబాటులోకి రానుంది.
మోహన్ లాల్ కు తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉండటం తో ఈ సినిమా ఇక్కడి ఆడి యెన్స్ లోనూ ఆసక్తి నెలకొప్పింది. తెలుగు వెర్షన్ లో నూ చిత్రం విడుదల కాతోతుం డటంతో ఖుషి అవుతున్నారు. ఈ చిత్రానికి లిజో జోస్ పెలిసరి దర్శ కత్వం వహించారు.