అల్లు అర్జున్ తో కాదు.. నెక్స్ట్ మూవీ కోసం ఆ స్టార్ హీరోని లైన్లో పెట్టిన గురూజీ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దారెటు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్ల విషయంలో మాత్రం పరవాలేదు అనిపించింది అని చెప్పాలి. గుంటూరు కారం ముగిసిన వెంటనే రాజమౌళితో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు.

 అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అనే విషయంపై మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి. అయితే మాటల మాంత్రికుడి తర్వాత ప్రాజెక్ట్ దాదాపు ఖరారు అయిపోయినట్లే అంటూ ఒక టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. అయితే మహేష్ తో సినిమా ముగియగానే అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తో సినిమా అంటే ఇక త్రివిక్రమ్ కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ గ్యాప్ లో తమిళ స్టార్ హీరో తో సినిమాకు రెడీ అయ్యారట త్రివిక్రమ్. దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి పెద్ద చర్చ జరుగుతుంది.

 ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ 69వ సినిమానే చివరి సినిమా అంటూ చెబుతున్నారు. కానీ తమిళ టాప్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఇక విజయ్ మరో సినిమా ఉండే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది  కానీ ఇప్పుడు ఇక ఈ సినిమాకు నిర్మతగా వ్యవహరిస్తున్న తెలుగు ప్రొడ్యూసర్ డివివి దానయ్య త్రివిక్రమ్ని సీన్లోకి తీసుకువచ్చారట. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ కూడా వినిపించగా విజయ్ కి నచ్చిందట. కాగా ప్రస్తుతం దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలో నటిస్తూ ఉన్నాడు. ఇది పూర్తి చేసిన తర్వాత విజయ్ తన 70వ సినిమాకు సిద్ధమవుతాడు అని సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: