యంగ్ టైగర్ విషయంలో ఆ సెంటిమెంట్ ఎక్కవగా కనిపిస్తుందా....??

murali krishna
సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం వచ్చింది అంటే దానిని సినిమా పండగ అందరూ వర్ణిస్తూ ఉంటారు ఎందుకంటే 99% అన్ని సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతూ ఉంటాయి.ప్రతి శుక్రవారం విడుదలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమో కొన్ని అరుదైన సమయాలలో మాత్రమే ఆ రోజు కాకుండా మరో వారాన్ని పెట్టుకొని సినిమా విడుదల చేస్తారు కొన్ని సందర్భాలలో సంక్రాంతి పండుగకు ఇలా వారం లేకుండా చిత్రాలను విడుదల చేస్తూ ఉంటారు. కానీ ఈ వీటికి అతీతంగా వారంతో సంబంధం లేకుండా కలెక్షన్ల సునామి సృష్టించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు ఉంటాడు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది దీనిని మొదట వేసవి సెలవులలో లేదంటే దసరా పండుగకు విడుదల చేయాలని భావించారు దాంతో తాజాగా దానికి సంబంధించిన రిలీజ్ డేట్ ని సినిమా యూనిట్ ప్రకటించింది. మొదటి ఏప్రిల్ అనుకున్న ఈ సినిమాలు కాస్త ఇప్పుడు అక్టోబర్ 10 వ తారీఖున విడుదల చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి గురువారం రోజు విడుదల చేయనున్నారు టీం. అందుకు వారి సెంటిమెంటే కారణం అని కూడా చెబుతున్నారు. కొరటాల శివతో ఇంతకు ముందు జనతా గ్యారేజ్ అనే సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ కలిసి పని చేయగా ఆ సినిమా కూడా 2016లో సెప్టెంబరు 1వ తారీకున విడుదల అయింది. అది కూడా గురువారం రోజునే కావడం విశేషం.
ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు. మరో రెండు చిత్రాలు గురువారం రోజు విడుదలై బంపర్ హిట్ కలెక్షన్స్ సాధించాయి. అందులో ఒకటి అరవింద సమేత వీర రాఘవ. 2018 అక్టోబర్ 11 న విడుదలైన ఈ చిత్రం కూడా గురువారం రోజు విడుదలై బంపర్ హిట్టు కలెక్షన్స్ సాధించింది.ఇక జూనియర్ 3 పాత్రలో నటించిన లవ కుశ సినిమా సైతం 2017, సెప్టెంబర్ 21 న గురువారం రోజు విడుదల అయ్యి హిట్ అందుకుంది. ఇలా తారక్ కెరీర్ లో శుక్రవారం కాకుండా గురువారం సైంటిమెంటు ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ సెంటిమెంట్ నిజమై దేవర కూడా విజయాన్ని అందుకోవాలని ఆయన ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అయితే కొరటాల శివ ఆచార్య సినిమాతో కాస్త నెగటివ్ టాక్ మూట కట్టుకున్నాడు మరి దేవరా సినిమా ఎలా ఉంటుందో వేస్ట్ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: