
హనుమంతుడి అన్వేషణలో ప్రశాంత్ వర్మ !
భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసీక్వెల్ లో హనుమంతుడి పాత్రలో ఒక సీనియర్ హీరో నటిస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవిని అడిగినప్పటికీ అతడు సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఆతరువాత ఈపాత్ర కోసం రానా తో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆవిషయంలో కూడ క్లారిటీ లేదు అంటున్నారు. దీనితో ప్రశాంత్ వర్మ ‘కేజీ ఎఫ్’ ఫేమ్ యష్ తో హనుమంతుడి పాత్ర విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే యష్ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రావణు డి పాత్ర వేయబోతున్న నేపధ్యంలో ఆమూవీ మూడు భాగాలుగా నిర్మాణం జరుపుకునే పరిస్థితులలో యష్ డేట్స్ లభించడం కష్టం అని అంటున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో తీయబోతున్న ఈమూవీకి భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్న పరిస్థితులలో ఈమూవీ మార్కెట్ అవ్వాలీ అంటే ఒక టాప్ హీరో ఈమూవీలో హనుమంతుడి పాత్ర ఒక హీరో వేసి తీరాలి. ఇప్పుడు అలాంటి హీరో ఎవరు అన్నది ప్రశాంత్ వర్మ అన్వేషణ. దీనితో ‘హనుమాన్’ సూపర్ సక్సస్ అయిన ఆనందం కంటే ఈసినిమా సీక్వెల్ కు సరైన హీరో దొరకలేదు అన్న టెన్షన్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ తన అన్వేషణను జాతీయ స్థాయిలో కొనసాగిస్తున్నాడు అంటూ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తూ ఉండటం ఒక షాకింగ్ న్యూస్..