హైదరాబాద్ లో ఓయ్ చూడనున్న సిద్ధార్థ్..!
ఇక ఇదిలాఉంటే ఓయ్ డైరెక్టర్ ఆనంద్ రంగ ఈ మేరకు సిద్ధార్థ్ ఫ్యాస్ కు ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కువ మంది ఓయ్ సినిమా చూస్తున్నారో చెప్పండి ఆ షోకి తాను సిద్ధార్థ్ ని తీసుకుని వస్తానని అన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆనంద్ రంగ పెట్టిన ఈ కామెంట్స్ హడావిడి చేస్తుంది. సిద్ధార్థ్ తో కలిసి అతను నటించిన ఓయ్ సినిమా చూడటం క్రేజీ థింగ్ అని చెప్పొచ్చు.
మరి హైదరాబాద్ లో ఏ షోలో సిద్ధార్థ్ అటెండ్ అవుతాడన్నది చూడాలి. టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా సిద్ధార్థ్ ఓయ్ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. సినిమాను చూస్తూ అందులోని సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాని సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పెట్టారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రిలీజైన సినిమా కు రీ రిలీజ్ టైం లో ఈ రేంజ్ రెస్పాన్స్ అందించడం గొప్ప విషయమని చెప్పొచ్చు. సిద్ధార్థ్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ ని ఈ ఓయ్ రీ రిలీజ్ మరోసారి గుర్తు చేస్తుంది. చూస్తుంటే ఓయ్ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చినా రావొచ్చని చెప్పొచ్చు.