ఓయ్ పై ప్రేమను కురిపించిన యూత్ షాక్ లో సిద్ధార్థ్ !

Seetha Sailaja
ఎప్పటిలాగే వేలంటైన్స్ డేని తెలుగు రాష్ట్రాలలోని యూత్ ఉత్సాహంగా జోష్ తో జరుపుకున్నారు. సినిమా ధియేటర్లు హోటల్స్ పబ్ లు యూత్ ను ఆకర్షిస్తూ అనేక ఆఫర్లు ప్రకటించడంతో అన్నిచోట్ల సందడి వాతావరణం కనిపించింది. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొన్ని యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీలను ఈవారం రిలీజ్ చేశారు.

ఆలిస్టులో హీరో సిద్ధార్థ్ నటించిన ‘ఓయ్’ కూడ ఉంది. 2009లో రిలీజ్ అయిన ఈమూవీ అప్పట్లో పరాజయం పొందింది. అయితే ఇప్పుడు అదే సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా యూత్ బాగా చూడటంతో తెలుగు రాష్ట్రాలలో చాల చోట్ల ఈమూవీకి మంచి కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మణిరత్నం ‘గీతాంజలి’ ఫేమ్ షామిలీ ఈ మూవీలో సిద్ధార్థ్ పక్కన నటించింది.

ఈసినిమాలో భావోద్వేగాలను దర్శకుడు ఆనంద్ రంగ చాల అద్భుతంగా చూపించినప్పటికీ అప్పట్లో ఆతరం యూత్ ఈసినిమాను పెద్దగా ఆదరించలేదు. ఈసినిమా తరువాత దర్శకుడు ఆనంద రంగా షాక్ తో మరొక సినిమాకు దర్శకత్వం వహించలేదు అని అంటారు. సుమారు 15 సంవత్సరాల క్రితం విడుదలై ఫెయిల్ అయిన మూవీని నెటితరం యూత్ ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయడం షాకింగ్ గా మారింది.

ఈసినిమాను ఇప్పుడు యూత్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆరోజులలో ఈసినిమాను ఎంజాయ్ చేసి సక్సస్ చేసి ఉంటే హీరో సిద్దార్థ్ కు మరిన్ని సినిమాలు వచ్చి అతడి కెరియర్ మరికొన్ని సంవత్సరాలు కొనసాగి ఉండేది. అదేవిధంగా ఈ మూవీ దర్శకుడు మరిన్ని సినిమాలను తీసి ఉండేవాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఎన్నికలలో సినిమాల విషయంలో ప్రజలు ఏరోజు ఏవిధంగా ఉంటారో వారికే తెలియని పరిస్థితి కొనసాగుతూ ఉంది కాబట్టి దేశ రాజకీయాలతో పాటు సినిమా మేకింగ్ కూడ చాల అయోమయంగా మారి పోవడంతో ఎన్నికల ఫలితాలు అదేవిధంగా సినిమాల ఫలితాలు తలలు పండిన వారికి కూడ అర్థంకాని పరిస్థితులలో పడేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: