"ఆర్సి16" ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదంట..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో బుచ్చి బాబు సనా దర్శకత్వం లో రూపొందిపోయే సినిమా లో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నా డు. ఇక పోతే ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందినట్లు ... ఈ సినిమా కోడి రామ్మూర్తి అనే వ్యక్తి బయోపిక్ ఆధారంగా తెరకెక్క బోతుంది అని అనేక వార్తలు తెర పైకి వచ్చాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ నే అయినప్పటికీ ఇది కోడి రామమూర్తి బయోపిక్ కాదు అని ఇది బుచ్చిబాబు సొంత గా రాసుకున్న కథ అని తెలుస్తుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ గ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ మార్చి నెల ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. చరణ్ , శంకర్ కాంబో లో రూపొందుతున్న మూవీ కావడంతో ఇండియా వ్యాప్తంగా ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: