96 రీరిలీజ్.. జానుని మర్చిపోయారా..?

shami
విజయ్ సేతుపతి త్రిష జంటగా నటించిన 96 సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. త్రిషని మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చేలా చేసిన ఆ సినిమా కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ సేతుపతికి కూడా ఆ మూవీ సక్సెస్ సూపర్ క్రేజ్ తెచ్చింది. ప్రేం కుమార్ డైరెక్ట్ చేసిన 96 సినిమాకు గోవింద్ వసంత్ మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ ఎంత హెల్ప్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సినిమాను తెలుగులో రీమేక్ చేయగా ఆ మ్యాజిక్ రిపీట్ చేయలేదు కానీ మ్యూజిక్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

96 సినిమాను తెలుగు లో జానుగా రీమేక్ చేశారు. అక్కడ విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఆ మూవీని తెలుగులో శర్వానంద్, సమంత కలిసి నటించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా 96 సినిమా రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

కోలీవుడ్ లోనే కాదు 96 సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే 96 రీ రిలీజ్ చేస్తున్నారు కానీ జాను సినిమాను మాత్రం మర్చిపోయారు. జాను సినిమా రీ రిలీజ్ చేయట్లేదు కానీ 96 ని రీ రిలీజ్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

విజయ్ సేతుపతి, త్రిష మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. 96 సినిమాలో వారిద్దరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే కోలీవుడ్ లో విజయ్ సేతుపతి ఎక్కువగా నెగిటివ్ రోల్ లో చేస్తున్నారు. ఓ పక్క త్రిష వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం త్రిష మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తుంది. అంతకుముందు ఆచార్యలో త్రిష నటించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్ గా విశ్వంభరతో త్రిష తిరిగి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: