మీడియాకు షాక్ ఇచ్చిన హరీష్ శంకర్ సెటైర్లు !

Seetha Sailaja
హరీష్ శంకర్ కొన్ని సందర్భాలలో తన సహనాన్ని కోల్పోతూ ఉంటాడు. ముఖ్యంగా మీడియాలో వచ్చే గాసిప్పుల విషయంలో హరీష్ శంకర్ తన ఆగ్రహాన్ని వ్యక్తపరచడం సర్వసాధారణం. లేటెస్ట్ గా జరిగిన ‘ఈగల్’ సక్సస్ మీట్ లో మళ్ళీ హరీష్ శంకర్ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ ఆవేదన నిండిన స్వరంతో సెటైర్లు వేశాడు.

ఈ ఫంక్షన్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా తనకు అవకాశాలు రావడం లేదనీ మీడియాలోని కొన్ని వర్గాలు తనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో గాసిప్పులు రాశారని ఆ గాసిప్పులను చూసి తాను బాధపడిన విషయాన్ని వివరిస్తూ తనకు అవకాశాలు రావడంలేదనీ మీడియాలోని కొన్ని వర్గాలు తన పై టార్గెట్ చేస్తూ వార్తలు వ్రాసినందుకు తాను పడ్డ మనోవేదన వివరించాడు. ప్రస్తుతం తన ఆద్వర్యంలో తీస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆగిపోయిందని ఏవేవో వార్తలు తన ఫోటో కూడ పెట్టకుండా కొన్ని సోషల్ మీడియా పేజీలలో వచ్చిన వార్తలు తన దృష్టి వరకు రావడంతో తాను ఇలాంటి క్లారిటీ ఇస్తున్నట్లు వివరించాడు.

ఇకపోతే తాను దర్శకుడు కాకముందు చాల అవమానాలు పడిన సందర్భాలు తెలియచేస్తూ తన కెరియర్ మొదటి రోజులలో తన సొంత చుట్టాలు కూడ తనను పట్టించుకోవడం మానేసిన సందర్భాలను వివరిస్తూ కేవలం సినిమాల పట్ల వ్యామోహంతో తాను ఎన్ని అవమానాలు ఎదురైనా తాను పడిన కష్టాలను వివారిచాడు. ప్రస్తుతం సినిమాల పై తనకు ఎంతో అవగాహన ఉందని అంటూ త్వరలో మరో రెండు భారీ సినిమాలకు సంబంధించిన ప్రకటన వస్తుందని అనవసరంగా తనకు అవకాశాలు రావడం లేదు అంటూ వార్తలు వ్రాయద్దు అంటు తన పై విమర్శలు చేస్తున్న వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

అయితే హరీష్ శంకర్ ఇచ్చిన వార్నింగ్ ను పట్టించుకోకుండా గాసిపప్ లను ప్రచారంలోకి తీసుకురావడమే ఒక టార్గెట్ గా పెట్టుకున్న సోషల్ మీడియా వరగ్గాలు ఎంతవరకు హారీష్ శంకర్ వార్నింగ్ ను సీరియస్ గా తీసుకుంటాయి అన్నది వేచి చూడాలి..  మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: