ప్రభాస్ తీరులో మార్పుతీసుకు వస్తున్న మారుతి !

Seetha Sailaja
ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అయినప్పుడు ఆసినిమా పై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈసినిమాలోని ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు మీడియాకు లీక్ అయిన తరువాత గళ్ళ లుంగీతో మాస్ గెటప్ లో కనిపించిన ప్రభాస్ ను చూడగానే ఈమూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

గత కొన్ని సంవత్సరాలుగా పూర్తి యాక్షన్ సినిమాలను చేస్తున్న ప్రభాస్ లోని ఒకనాటి కామెడీ యాంగిల్ ను మారుతి తన ‘రాజా సాబ్’ లో చూపించబోతున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ‘సలార్’ మూవీలో అతి తక్కువ డైలాగ్స్ చెప్పిన ప్రభాస్ తన తీరుకు భిన్నంగా ఈమూవీలో చాల ఎక్కువగా గలగలా మాట్లాడే వ్యక్తిగా కనిపించి అందర్నీ ఆశ్చర్య పరచబోతున్నాడు.

హారర్ జానర్ లో తీయబడుతున్న ఈమూవీలో విజువల్ ఎఫెట్స్ కు చాల ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. ఈసినిమాకు సంబంధించి డిజైన్ చేయబడ్డ ప్రభాస్ మేకోవర్ ఆశ్చర్యపరిచేలా ఉండటమే కాకుండా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ లో అదేవిధంగా అతడి డైలాగ్ డెలివరీలో చాల మార్పులు మారుతి తీసుకు వస్తున్నట్లు టాక్. ప్రభాస్ గతంలో నటించిన ‘డార్లింగ్’ మూవీలోని చిలిపితనం ‘మిర్చి’ మూవీలోని సీరియస్ నెస్ రెండు కలిపిన పాత్రగా ‘రాజా సాబ్’ లో ప్రభాస్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఈసినిమాకు సంబంధించిన సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు క్లైమాక్స్ సీన్స్ ఈమూవీని మరో రేంజ్ కి తీసుకువెళతాయి అని అంటున్నారు. ఈసినిమా షూటింగ్ ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే పూర్తి అయిన నేపధ్యంలో మిగిలిన సగ భాగాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని మారుతి భావిస్తున్నప్పటికీ ప్రభాస్ ప్రాధాన్యత మాత్రం ‘సలార్ 2’ పై ఉంది అంటున్నారు. అయితే మారుతి ప్రభాస్ ను ఏదోవిధంగా ఒప్పించి ఈమూవీ షూటింగ్ ను వీలైనంత త్వరలో పూర్తి చేసి ఈసంవత్సరమే విడుదల చేయాలాని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: