చరణ్... బుచ్చిబాబు కాంబో మూవీలో హీరోయిన్ పై వచ్చిన వార్తల్లో వాస్తవం లేదట..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ , సుకుమార్ రైటింగ్స్ , మైత్రి సంస్థ వారు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మార్చి నెల చివరి నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోయే అవకాశం ఉండడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో కొంత మంది నటులు నటుల కోసం ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగ వంతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా ఓ ముద్దు.గుమ్మ కన్ఫామ్ అయ్యింది అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... బుచ్చిబాబు ఇప్పటికే చరణ్ సినిమా కోసం మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని అయినటువంటి సమంత ను హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలబడబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సమంత ను హీరోయిన్ గా కన్ఫామ్ చేయలేదు అని ఇది పక్కా ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు ఓ టాక్ బలంగా వినబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: