మూడు సార్లు రీ రిలీజై.. భారీ కలెక్షన్స్ సాధించిన సాయి పల్లవి మూవీ?

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి. ఏకంగా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసింది తక్కువ సినిమాలే అయినా తన పాత్రలతో ప్రేక్షకుల హృదయాలకు దగ్గర అయింది అన్న విషయం తెలిసిందే. గ్లామర్ వలకబోసే పాత్రల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ పోతుంది. ఇక డాన్సుల్లో కూడా తనను మించిన వారు ఇంకెవరూ లేరు అన్న విషయాన్ని ఇప్పటికే నిరూపించింది సాయి పల్లవి. ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్గా హవా నడిపిస్తున్న సాయి పల్లవిని.. కెరియర్ మొదట్లో ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఏది అంటే ప్రేమమ్ అని చెప్పాలి.

 నవీన్ పౌలి, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన ఈ మలయాళ మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆల్ఫోన్స్  దర్శకత్వం వహించిన ఈ సినిమా 2015లో విడుదలైంది. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్ల వరకు వసూళ్లను సాధించింది అని చెప్పాలి. ఇక తమిళనాడులోని ఎన్నో థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తెలుగులో కూడా ఇదే టైటిల్ తో ఈ సినిమాను నాగచైతన్య తో రీమేక్ చేయగా.. ఇక్కడ సూపర్ హిట్ అయింది.

 అయితే సాయి పల్లవి నటించిన ప్రేమమ్ మూవీ ని ఏకంగా మూడుసార్లు రీ రిలీజ్ చేయగా.  మూడుసార్లు కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. 2015లో విడుదలైన ఈ మూవీని 2016లో వాలంటైన్స్ డే సందర్భంగా తమిళంలో రిలీజ్ చేశారు. ఇక అప్పుడు కూడా ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2017లో మరోసారి ఈ మూవీని రిలీజ్ చేయగా.. ఇక మరోసారి భారీగా వసూళ్లు సాధించింది ప్రేమమ్ సినిమా. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 1న తమిళనాడులో ఈ సినిమానిరీ రిలీజ్ చేయగా.. కేవలం ఐదు రోజుల్లోనే రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలా మూడుసార్లు రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఎక్కడా క్రేజ్ తగ్గలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: