లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ కి.. ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ బడా ఫ్యామిలీలో ఒకటిగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు పరిచయమయ్యారు. అయితే అరడజనుకు పైగా పరిచయమైన హీరోలు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నాగబాబు.. వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వరుణ్ తేజ్. ఇక తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మెగా ప్రిన్స్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల వరుణ్ తేజ్ ఓ ఇంటివాడు అయ్యాడు అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో హీరోయిన్గా గుర్తింపును సంపాదించుకున్న లావణ్య త్రిపాఠితో ఎన్నో ఏళ్లపాటు రహస్యంగా ప్రేమాయణం కొనసాగించిన వరుణ్ తేజ్.. ఇక ఇటీవల పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది అని చెప్పాలి. ఇక ఇటీవలే హనీమూన్ వెళ్లి వచ్చిన ఈ మెగా హీరో.. ప్రస్తుతం తాను నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా.. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

 ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వరుణ్ తేజ్ కు ఎదురయింది. దీంతో ఎక్కడ తడబడకుండా తన భార్య లావణ్య త్రిపాఠినే తన ఫేవరెట్ హీరోయిన్ అని.. అందుకే ఆమెను ప్రేమించాను అంటూ సమాధానం చెప్పాడు వరుణ్ తేజ్. ఇక మంచి కథలు వస్తే ఇద్దరం కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా తానే లావణ్య కు ప్రపోజ్ చేశాను అన్న విషయాన్ని తెలిపాడు. అయితే లావణ్య త్రిపాఠి కాకుండా సాయి పల్లవి అంటే కూడా తనకు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్. ఇకఈ మెగా హీరో నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చ్ ఒకటవ తేదీన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: