జబర్దస్త్ లో ఎవరు సపోర్ట్ చేయరు.. షాకింగ్ విషయం చెప్పిన కమెడియన్?

praveen
ఇటీవల కాలంతో సినిమాలు కంటే వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాల్లో అయితే కొంచెం రిస్క్ చేయడానికి స్టార్ హీరోలు వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే వెబ్ సిరీస్లలో మాత్రం ఎంతో మంది కొత్త నటులు ఇంక సరికొత్తగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉంటారు. దీంతో ఇటీవల కాలంలో ఓటీటిలో విడుదలవుతున్న వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అవుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఓటీటిలో తెగ ట్రెండింగ్ మారిపోయిన వెబ్ సిరీస్ ఏది అంటే 90sఏ మిడిల్ క్లాస్ బయోపిక్.

 అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ తెగ కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ లోని ప్రతి పాత్ర కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. కాగా ఈ సిరీస్ లో సీనియర్ నటుడు శివాజీ కీలక పాత్రలో నటించాడు అన్న విషయం తెలిసిందే. ఇదే వెబ్ సిరీస్ లో ఏకంగా టీచర్ రోల్ లో నటించాడు జబర్దస్త్ నటుడు సందీప్. తన నటనతో పాత్రకు ప్రాణం పోశాడు అని చెప్పాలి. అయితే సందీప్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ కు హాజరయ్యారు. ఈ వెబ్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నా రూమ్ మెట్ అంటూ సందీప్ వెల్లడించాడు.

 జబర్దస్త్ లో ఎన్నో స్కిట్లు చేశానని.. అయితే ఆ సమయంలో డైరెక్టర్ తో ఉన్న స్నేహం వల్ల ఈ సిరీస్ లో ఛాన్స్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నాకు ఎప్పుడూ ఆదిత్య హాసన్ కథలు చెబుతూ ఉండేవాడు. అతని కథలు విని షాక్ అయ్యేవాడిని.. నా స్వస్థలం కామారెడ్డి  ఇంటర్లోనే ఇండస్ట్రీపై ఆసక్తి పెరిగింది. అయితే చలాకీ చంటి ఛాన్స్ ఇచ్చారు అంటూ సందీప్ చెప్పుకొచ్చారు. నేను జబర్దస్త్ స్కిట్లు రాసాను తెలపడానికి.. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. జబర్దస్త్ లో ఎవరికి సపోర్ట్ ఉండదని.. కష్టపడితేనే గుర్తుకు వస్తుందని  చెప్పుకొచ్చాడు. జబర్దస్త్ లో అన్ని రకాల స్కిట్లు చేసిన రాని గుర్తింపు ఒక వెబ్ సిరీస్ తో వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు సందీప్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: