సుమా షోస్ తగ్గించడానికి కారణం అదేనట.. నిజం చెప్పేసిన రాజీవ్ కనకాల?

praveen
యాంకర్ సుమ.. ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే యాంకర్ గా ఆ రేంజ్ లోఅలరించి తన వాక్చాతుర్యంతో  ప్రేక్షకులకు అంతలా దగ్గర అయింది. గతంలో స్టార్ మహిళ అనే ప్రోగ్రాం ద్వారా దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు బుల్లి ప్రేక్షకులను టీవీలకు కట్టిపడేసిన ఈ యాంకరమ్మ ఇక ఆ తర్వాత పలు షోలలో కూడా చేయడం చేసింది. తర్వాత క్యాష్ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఇక ఇప్పుడు సుమా అడ్డ అనే పేరుతో మరో కొత్త షో తో ప్రేక్షకులను ఎంటర్టైన్  చేస్తుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే కేవలం టీవీ షోలు మాత్రమే కాదు యూట్యూబ్లో కూడా పలు షోలు చేస్తూ బిజీ బిజీ అని గడుపుతుంది. అదే సమయంలో టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైనా స్టార్ హీరో కి సంబంధించిన సినిమా ఈవెంట్ జరిగింది అంటే చాలు ఇక ఆ సినిమా ఈవెంట్ ను వ్యాఖ్యాతగా ముందుకు నడిపించడానికి సుమానే ప్రత్యక్షమవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఈ మధ్యకాలంలో ఎందుకో యాంకర్ సుమ అటు టీవీ షోలు కాస్త తగ్గించేసింది అని చెప్పాలి. సుమ ఎందుకు ఇలా షోస్ తక్కువ చేసింది అనే విషయంపై చర్చ కూడా జరుగుతుంది. కాగా ఇదే విషయంపై యాంకర్ సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు.

 సుమ వల్లే తాము ఈ పొజిషన్లో ఉన్నాం అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా దృఢంగా అయినట్లు తెలిపారు. ఇక తాము ఇద్దరం కలిసి తమ తండ్రి చేసిన అప్పులన్నింటినీ కూడా తీర్చాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎన్ని షోలు చేసినా ఎంత బిజీగా ఉన్నా పిల్లలను నన్ను మాత్రం సుమ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. సాయంత్రం 6:00 గంటలకు  కచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇప్పుడు సుమ షోస్ తగ్గించడానికి కారణం పిల్లలే అంటూ చెప్పుకొచ్చింది. పిల్లలతో పాటు సొంతంగా యూట్యూబ్ ఛానల్ లో పలు షోలు చేస్తుంది. ఇలా బిజీ ఉండడం కారణంగానే ప్రస్తుతం సుమ షోస్ తగ్గించింది అంటూ రాజీవ్ కనకాల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: