పెళ్ళెప్పుడన్న నేటిజన్.. ట్విస్ట్ ఇచ్చిన విజయ్ వర్మ?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది తమన్నా. ఇక మిల్కీ బ్యూటీగా ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. తన అందం అభినయంతో ఎంతో మంది కుర్ర కారు మతి పోగొట్టింది ఈ సొగసరి. అయితే ఇంతలా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ప్రేమాయణం గురించిన విషయం బయటకు వచ్చింది అంటే అది టాలీవుడ్లో ఎంతలా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో తమన్నాతో కలిసి నటించిన బాలీవుడ్ నటుడు విజయవర్మతో ప్రేమలో మునిగి తేలుతుంది తమన్నా.


 ఎన్ని రోజుల నుంచి వీరి ప్రేమ గురించి వార్తలు రాగా.. ఇక ఈ జంట వారి ప్రేమను అఫీషియల్ గా ప్రకటించేసింది. దీంతో ఇక తమన్న, విజయ్ వర్మ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నో రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి అనే విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ రెస్టారెంట్స్ ఈవెంట్లలో పాల్గొంటూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఒకవైపు చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూనే మరోవైపు వరుస సినిమాలతో కెరియర్ లో కూడా బిజీబిజీగా ఉన్నారు ఇద్దరు. అయితే ఇక తమన్నా, విజయ్ వర్మ ఎక్కడికి వెళ్లినా కూడా వీరు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

అయితే ఇటీవల సోషల్ మీడియాలో నేటిజన్స్  తో ముచ్చటించాడు విజయ్ వర్మ. ఈ క్రమంలోనే నేటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం చెప్పాడు అని చెప్పాలి. అయితే ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ లో మొత్తం పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయ్.  పెళ్లెప్పుడు చేసుకుంటావు అని ఒక నేటిజన్ అడిగా.. చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు విజయ్ వర్మ. నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతుంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తుంది అంటూ ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు. అయితే విజయ్ వర్మను ఈ ప్రశ్న అడిగింది ఎవరో కాదు అతని మేనకోడలే కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: