ఓటీటీ లోకి వచ్చేసిన వెంకటేష్ 'సైంధవ్'....!!

murali krishna
టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైంధవ్.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన  అయిన ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.అయితే విక్టరీ వెంకటేష్ చాలా కాలం తర్వాత ఈ మూవీ లో ఊర మాస్ లుక్‏లో కనిపించి అలరించారు.సైంధవ్ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ మరియు టీజర్ తోనే ఈమూవీపై ఆసక్తిని కలిగించారు మేకర్స్. అలాగే ఈ మూవీలోని పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కంటెంట్ బలంగా ఉన్నా కానీ సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో ఈ మూవీకి అనుకున్నంత  కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా క్లిక్ అయ్యాయి.ఇదిలా ఉంటే సైంధవ్ మూవీ రిలీజ్ అయి నెల రోజులు కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది.


ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిబ్రవరి 3 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది.అంటే ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఈ సినిమాను ను థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో నేరుగా చూడొచ్చు. కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి ఓ తండ్రి చేసే పోరాటమే 'సైంధవ్'. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ మరియు బేబీ సారా కీలక పాత్రలలో నటించారు.ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. తన కూతురికి అరుదైన జబ్బు ఉందని వెంకటేష్ కు తెలుస్తుంది. ఆ సమస్య నుంచి తన కూతురిని రక్షించుకోవాలంటే రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్ కావాలి. దీంతో తన కూతురిని ఎలా కాపాడుకోవాలని అని బాధపడుతుండగా.. అదే జబ్బుతో ఇంకా చాలా మంది చిన్నారులు బాధపడుతున్నారని తెలుసుకుంటాడు. అదే సమయంలో కొందరు టెర్రరిస్టులు వెంకీని చూసి భయపడుతుంటారు. ఇంతకీ వారికి వెంకీ వున్న సంబంధం ఏంటీ ?.. తన చిన్నారిని ఎలా కాపాడుకుంటాడు..అనేది సైంధవ్ మూవీ ప్రధాన కథ.. మరి థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని సైంధవ్ ఓటీటీ ప్రేక్షకులను అయిన మెప్పిస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: