"సరిపోదా శనివారం" నార్త్ అమెరికా హక్కులను దక్కించుకున్న క్రేజీ సంస్థ..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ.కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అలాగే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

కాకపోతే ఇదే తేదీన పుష్ప పార్ట్ 2 మూవీ ని విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. పుష్ప పార్ట్ 2 మూవీ కనుక విడుదల వాయిదా పడినట్లు అయితే ఆ తేదీనే సరిపోదా శనివారం సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వారు దక్కించుకున్నట్లు అధికారికంగా ఈ చిత్ర బృందం వారు ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా థియేటర్ హక్కులను కూడా ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను నార్త్ అమెరికాలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై నాని అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: