హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి.. రూ.1000 కోట్ల ఆఫర్?

praveen
ప్రస్తుతం కేవలం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అంతట ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ మూవీ గురించి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ సజ్జ అనే చిన్న హీరోతో సంక్రాంతి బరిలో దిగిన ప్రశాంత్ వర్మ.. ఇక స్టార్ హీరోలను వెనక్కినట్టు మరి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు అని చెప్పాలి.

 ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ కాదు మన హనుమంతుడు అంతకు మించిన సూపర్ హీరో అన్న విషయాన్ని తన సినిమాతో మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేశాడు ప్రశాంత్ వర్మ. ఇక డివోషనల్ టచ్ తో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సూపర్ మాన్ మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలిచేసింది అనడంలో సందేహం లేదు. అది తక్కువ బడ్జెట్లో ప్రశాంత్ ఇంత అద్భుతమైన సినిమా ఎలా చేయగలిగాడు అని సినీ ప్రేక్షకులు, విశ్లేషకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక అతని తర్వాత ప్రాజెక్టులపై కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి.

 ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం హనుమాన్ మూవీ దర్శకుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. కాగా ఇటీవలే ఒక  ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ డైరెక్టర్ ఒక ఆసక్తికర విషయాన్ని అందరితో పంచుకున్నాడు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు తనకు భారీగా అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఒక ఎన్నారై ఏకంగా 1000 కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. 1000 కోట్ల రూపాయలు ఇస్తాను. మన ఇతిహాసాలతో సినిమాలు తీయు అంటూ ఎన్నారై  కోరాడు అన్న విషయాన్ని ఇక ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒకవేళ ప్రశాంత్ వర్మ 1000 కోట్లతో సినిమా చేస్తే ఆ మూవీ రెండు వేల కోట్లు వసూలు చేయడం ఖాయమంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: