ఈ 2024 సంక్రాంతి బరిలో హీరోగా హనుమాన్ సినిమా నిలిచింది. ఇక టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చి హైయ్యెస్ట్ కలెక్షన్లు సంపాదించిన సినిమాల గురించి తెలుసుకుందాం.పాన్ ఇండియా మూవీ హనుమాన్ సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 265 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా థియేటర్ల లో రన్ అవుతుంది.అంతేగాక ఈ సినిమా మేకర్స్ కి 100 కోట్ల పైగా లాభాలు తెచ్చిపెట్టింది. రాజమౌళి సినిమాల తరువాత 100 కోట్ల పైగా లాభాలు తెచ్చిన సినిమాగా హనుమాన్ సినిమా నిలిచింది. ఫైనల్ రన్ లో ఖచ్చితంగా 300 కోట్ల మార్క్ చేరే అవకాశం ఉంది.ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురం సినిమా జనవరి 12, 2020లోసంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.2020 లో సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 262 కోట్లు కలెక్ట్ చేసింది.అయితే ఇప్పటి దాకా సంక్రాంతి బరిలో వచ్చి హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా అలవైకుంఠపురం సినిమా ఉండేది. కానీ ఈసారి అలవైకుంఠపురం సినిమా రికార్డుని చెరిపివేసి హనుమాన్ సినిమా హైయ్యెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది.అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 జనవరి 10న సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద 260 కోట్లను కొల్లగొట్టి సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది.
అలాగే గుంటూరు కారం సినిమా ఈ 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ టాక్ తో కూడా రికార్డ్ కలెక్షన్లు సాధించింది.సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల పైగా వసూలు చేసి మరోసారి సూపర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది.దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి డిస్ట్రిబ్యూటర్లని నష్టాలు పాలు కాకుండా కాపాడింది.ఇంకా ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా రవితేజ ముఖ్య పాత్రలో బాబి దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య మూవీ 2023, జనవరి 12 సంక్రాంతి కానుకగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీస్ వద్ద 230 కోట్లు కలెక్ట్ చేసింది.
అలాగే చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఖైదీ నెంబర్ 150.ఈ సినిమా కి మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.2017 సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో అభిమానులు వారి అభిమాన హీరోని థియేటర్లో చూడడానికి పోటెత్తారు. అలా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 165 కోట్లు కలెక్ట్ చేసింది.అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2. ఈ సినిమాలో తమన్నా,మెహరీన్ హీరోయిన్స్ గా చేశారు. 2019 జనవరి 12 సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద 130 కోట్లు వసూలు చేసింది.అలాగే బాలకృష్ణ, హనీ రోజ్,శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి సినిమాకి గోపీచంద్ మలలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2023జనవరి 12న సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద మొత్తం 127 కోట్లు వసూలు చేసింది.