మృణాల్ ఆ విషయంలో అస్సలు తగ్గేదేలేదు..!

shami
బాలీవుడ్ లో తనని కేవలం రొమాంటిక్ సినిమాల్లోనే తీసుకుంటున్నారు అక్కడ తనని లవ్ స్టోరీస్ కి పనికిరానని భావిస్తున్నారని రీసెంట్ గా కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్ అక్కడికి వెళ్తే చాలు ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది. మరి అలా గ్లామర్ షో చేస్తున్న భామలకు అలాంటి రొమాంటిక్ ఆఫర్లు రాకపోతే ప్రేమ కథలు ఎలా వస్తాయి. రీసెంట్ గా జరిగిన ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో మృణాల్ అందాల విందు తెలిసిందే.
తన పరువాలన్నీ కనిపించేలా సెలబ్రిటీస్ అందరిలో మృణాల్ వేడి పెంచే లుక్స్ తో కనిపించింది. బాలీవుడ్ ఈవెంట్ లో మృణాల్ ఇలా రెడీ అవ్వడం కొత్తేమి కాదు. కానీ అక్కడ మంచి సినిమాలు రావాలని అనుకుంటూ ఇలా రెచ్చిపోవడం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఫిల్మ్ ఫేర్ ఈవెంట్ లో అందరు కూడా మృణాల్ డెస్సింగ్ సెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.
ఇక తెలుగు విషయానికి వస్తే సీతారామం తో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న అంటూ మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాలతో మృణాల్ రేంజ్ పెరిగింది. తెలుగులో ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేస్తుంది అమ్మడు. అయితే ఈ సినిమా తర్వాత మరో రెండు కథలు రెడీగా ఉన్నాయట. వాటి విషయం లో మృణాల్ ఇంకా తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తుంది. బాలీవుడ్ ఈవెంట్ లో మాత్రం మృణాల్ రెచ్చిపోవడం అక్కడ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. బాలీవుడ్ లో ఇక మీదట అయినా మృణాల్ కోరుకున్నట్టుగా కేవలం రొమాంటిక్ మూవీస్ కాకుండా ప్రేమకథలు వస్తాయేమో చూడాలి. తెలుగులో మాత్రం మృణాల్ కి మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలే వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: