హీరో అన్వేషణలో బోయపాటి !

Seetha Sailaja
రామ్ తో బోయపాటి తీసిన ‘స్కంద’ మూవీ ఫెయిల్ అవ్వడంతో ఈ మాస్ మసాల దర్శకుడు టోటల్ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులలో గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బోయపాటి దర్శకత్వంలో ఒక మూవీ ఉంటుంది అంటూ ప్రకటన ఇచ్చి చాలమందికి షాక్ ఇచ్చారు. అయితే ఈమూవీలో హీరో ఎవరు అన్న స్పష్టత లేకుండా కేవలం దర్శకుడి పేరును మాత్రమే ప్రకటించడంతో బోయపాటి కథకు ఇంకా ఏ హీరో ఓకె చెప్పలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్ తో బోయపాటి ‘సరైనోడు’ మూవీని తీసిన నేపధ్యంలో మళ్ళీ బోయపాటి బన్నీల కాంబినేషన్ రిపీట్ అవుతుందా అన్న సందేహాలు కొందరికి కలిగాయి. ‘పుష్ప 2’ మూవీ కోసం బన్నీ గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ మూవీ విడుదలైన తరువాత మాత్రమే బన్నీ తన సినిమాలకు సంబంధించి ఒక క్లారిటీకి రావాలని అతడి ఆలోచన అంటున్నారు.

వాస్తవానికి బన్నీ దృష్టిలో బోయపాటి లాంటి మాస్ దర్శకులు లేరు అని అంటారు. బన్నీ ఆలోచనలలో మాత్రం రాజమౌళి సందీప్ వంగా తమిళ దర్శకుడు అట్లీ ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న బన్నీ తన ఆలోచనలను పక్కకు పెట్టి కేవలం సినిమా కథలు వింటూ ‘పుష్ప 2’ షూటింగ్ గ్యాప్ లో వచ్చిన ఖాళీ సమయాన్ని కథలు వినడం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత తరం యంగ్ హీరోలు చాలామంది రకరకాల కథలను వింటూ కాలం గడుపుతున్నారు. అయితే బోయపాటి మాత్రం తన మూవీకి సంబంధించిన కథను ఫైనల్ చేసుకుని బన్నీ వైపు చూస్తున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ను కథ విషయంలో మెప్పించడం అంత సులువైన పని కానప్పటికీ తన తండ్రి గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి బోయపాటి మూవీకి లైన్ క్లియర్ చేస్తాడా అన్న సందేహాలు కొందరికి ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: