ప్లీజ్.. అలాంటి తప్పుడు ప్రచారం చేయకండి : ప్రశాంత్ వర్మ

praveen
ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ప్రశాంత్ వర్మ పేరు మారుమోగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే తన సినిమాతో అంతలా ప్రేక్షకులు అందరినీ కూడా ప్రభావితం చేశాడు. హనుమాన్ అనే ఒక సినిమాను తెరకెక్కించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ వెనక్కి తగ్గని ప్రశాంత్ వర్మ తన సినిమాను రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.

 వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా భారీగా వస్తువులు సాధిస్తూ దూసుకుపోతోంది. ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ మూవీ 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చాలా రోజుల వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల డేట్స్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను అంటూ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు అని ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

 దీంతో ఎంతోమంది ఈ స్టార్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ప్రశాంత్ వర్మను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల తనపై వస్తున్న వార్తలు గురించి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. రామ్ చరణ్, అల్లు అర్జున్ డేట్స్ కోసం చాలా రోజులుగా వెయిట్ వెయిట్ చేసి తప్పు చేశాను అని.. తాను చెప్పినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. చాలా బాగా చెప్పావు బ్రదర్. కానీ నేను ఎప్పుడూ వీరి పేర్లను ప్రస్తావించలేదు. వీరంటే నాకు ఎంతో అభిమానం. సరైన స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా ఇప్పటికైనా సినిమా తీస్తా.. ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేసి తప్పుడు ప్రచారం చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: